![]() |
![]() |

ఇనయ ముజిబుర్ సుల్తానా.. బిగ్ బాస్ సీజన్-6 ముందు వరకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ సీజన్-6 తో ఫుల్ ఫేమస్ అయింది. రామ్ గోపాల్ వర్మతో చిందులు వేసిన వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకొని, బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. లేడీ టైగర్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు. హౌస్ లో ఎక్కువగా గొడవలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అందరి చూపు తన వైపు తిప్పుకుంది ఇనయా. హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కువ ప్రేక్షకులను సంపాదించుకుంది.
ఇనయ సుల్తానా బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకొని.. వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటూ వస్తోంది. హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుని తన వైపుకి తిప్పుకుంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని కాబోలు బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక చాలా మంది రిచ్ గా ఉండాలని ఇల్లు కొనడం, కార్ కొనడం చేస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు ఇనయా సుల్తానా కూడా చేరింది. బిగ్ బాస్ వల్ల తన ఫ్యామిలీకి దగ్గర అయిన ఇనయా.. కార్ కొని ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా వ్లాగ్స్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఇనయా.. తను నటించిన నటరత్నాలు సినిమా ఆడియో ఫంక్షన్ లో హాట్ లుక్స్ తో అదురగొట్టిన విషయం తెలిసిందే.
కాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక హాట్ వీడీయోని పోస్ట్ చేసింది. అందులో తను పొద్దున్నే లేచాక.. తన డే ఎలా స్టార్ట్ అవుతుందో ఒక వీడియోని షేర్ చేసింది. అందులో తన అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుంది. దీంతో నెటిజన్లు ఆ పోస్ట్ కింద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ఇస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది ఇనయా.
![]() |
![]() |